ములుగులో మావోయిస్టుల కుట్ర భగ్నం
– మందు పాతరను నిర్వీర్యం చేసిన ములుగు జిల్లా పోలీస్
– సాధారణ ప్రజలు నడిచే బాటలో అమర్చిన మందు పాతర
– అమాయకుల ప్రాణాలను తీస్తున్న మావోయిస్ట్ లు
– ప్రజల ప్రాణాల రక్షణకై పోలీసుల ముందస్తు విస్తృత తనిఖీలు
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : మావోయిస్టుల కుట్రను భగ్నం చేసి మందు పాతరను నిర్వీర్యం చేశారు. జిల్లాలోని తెలంగాణ – ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామం కర్రెగుట్ట అటవీ ప్రాంతoలో గత రెండు రోజుల నుండి ముందస్తు చర్యలలో బాగంగా ములుగు జిల్లా పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా బుధవారం మధ్యాహ్న సమయంలో వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిది చెలిమెల గ్రామ సమీపంలో సాదారణ ప్రజలు తిరిగే కాలి బాటల వెంబడి నిషేధిత సిపిఐ మావోయిస్టులు అమర్చి నటువంటి మందుపాతరను గుర్తించి వాటిని సురక్షితంగా నిర్వీర్యం చేశారు.