ఎల్.ఎల్.బి విద్యార్థిని మృతికి కారణమైన వారిపై చర్యతీసుకోవాలి : గోర్ సేనా ములుగు
ములుగు, తెలంగాణ జ్యోతి : హైదరబాద్ లోని మలక్ పేటలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఎల్.ఎల్.బి విద్యార్థిని ఇస్లావత్ శ్రావ్య మృతికి కారణమైన నింధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గోర్ సేనా ములుగు జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందించారు. శ్రావ్యది అనుమానస్పద మృతి కాదని, మృతి పట్ల ప్రభుత్వం చొరవ తీసుకొని విచారణ చేపట్టి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో గోర్ సేనా ములుగు జిల్లా అధ్యక్షులు పొరిక రాజ్ కుమార్ నాయక్ , దారావత్ సారయ్య నాయక్ , నాగావత్ ప్రతాప్ సింగ్ నాయక్, మూడ్ రవీందర్ నాయక్ , బోడ కిషన్ నాయక్, పొరిక రాహుల్ నాయక్, భూక్యా దేవేందర్ నాయక్, రఘు, రవి, పొరిక గాంధీ, నూనావత్ రవివర్మ తదితరులు ఉన్నారు.