శనివారంతో ముగియనున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ.
-మొదలుకానున్న ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శనివారంతో ముగియ నుంది. వెంకటాపురం మండలంలోని 18 పంచాయతీలలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం నుండి కేంద్రాల నుండి శుక్రవారం నాటికి వేల సంఖ్యలో దరఖాస్తులు ప్రజల నుండి స్వీకరించారు. అలాగే వాజేడు మండలంలోని అన్ని పంచాయతీలలో కూడా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కి విశేష స్పందన లభించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజా పాలన, అభయహస్తం ఐదు గ్యారెంటీ ల స్కీం కార్యక్రమం నుండి ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను శుక్రవారం ఐదో తేదీ నుండి ఆన్లైన్ డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఈ మేరకు ఆయా డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఎటూ రు నాగారంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిసింది. శనివారంతో ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం ముగుస్తుండటంతో దూర ప్రాంతాల్లో ఉన్న మండల, గ్రామ వాసులు తమ,తమ గ్రామాలకు చేరుకొని, ఆఖరి రోజు దరఖాస్తులు అందజేసేందుకు పెద్ద సంఖ్యలో స్వీకరణ కేంద్రాలలో బారులు తీరనున్నట్లు సమాచారం. ఐదో తేదీ నాటికి ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ తదితర వివరాలను వెంకటాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ. బాబు ఆయా వివరాలను అధికారిక ప్రకటన ద్వారా మీడియాకు విడుదల చేశారు.
1 thought on “శనివారంతో ముగియనున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ. ”