డ్రగ్స్‌తో జీవితాలు నాశనం చేసుకోవద్దు

డ్రగ్స్‌తో జీవితాలు నాశనం చేసుకోవద్దు

 – అదనపు ఎస్పి ఏ. నరేష్ కుమార్

తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి :  డ్రగ్స్‌ బారినపడి జీవితాలను నాశనం చేసుకోరాదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పి ఏ. నరేష్ కుమార్ అన్నారు. ఎస్పి కిరణ్ ఖరే ఆదేశాలతో భూపాలపల్లి డిఎస్పీ రాములు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జూనియర్‌ కళాశాల, పాఠశాల విద్యార్థులతో ర్యాలీ తో పాటు, యాంటీ డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు చెడు మార్గాలకు దూరంగా ఉండాల న్నారు. డ్రగ్స్‌ బారిన పడి ఎంతో మంది జీవితాలు దుర్భరం అయ్యాయని, వ్యసనాలకు బానిస లుగా కారాదన్నారు. ఎక్కడైనా డ్రగ్స్‌ విషయం తెలిసిన తక్షణమే పోలీసులకు సమాచారం ఇస్తే తప్పక చర్యలు తీసుకుంటామ న్నారు. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రుల కష్టాలు గుర్తు పెట్టుకుని క్రమశిక్షణతో చదువుకుంటూ కళాశాలకు మంచిపేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, భూపాలపల్లి సిఐ రాంనర్సింహా రెడ్డి, ఎస్ ఐ లు సంధ్యారాణి, శ్రీలత, శ్రావణ్, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “డ్రగ్స్‌తో జీవితాలు నాశనం చేసుకోవద్దు”

Leave a comment