Medaram : అమ్మవారి ఆశీస్సులతో అందరికీ ఆయుష్ష్పు!

Written by telangana jyothi

Published on:

Medaram : అమ్మవారి ఆశీస్సులతో అందరికీ ఆయుష్ష్పు!

– మేడారం జాతరలో ఆయుష్ ఉచిత వైద్య శిబిరం

– ప్రారంభించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క –    

– ఆయుర్వేద, హెూమియో, యునాని వైద్యం అందుబాటు

– శిబిరంలో 12 మంది డాక్టర్లు. 12 మంది పారామెడికల్ సిబ్బంది

– భక్తుల నుంచి మంచి స్పందన: ఆయుష్ ఆర్డి రవినాయక్

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత ఆయుష్ వైద్య శిబిరాన్ని సోమవారం రాష్ట్ర రెవిన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ, గృహ నిర్మాణం శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ ( సీతక్క) ప్రారంభించారు. ఈ శిబిరం ఈనెల 24వ తేదీ సాయంత్రం వరకు కొనసాగనుంది. ఇందులో 12 మంది డాక్టర్లు మరో 12 మంది పారామెడికల్ సిబ్బంది ఉంటారు. రెండు షిప్టులుగా విధులు నిర్వహిస్తారు. ఆయుర్వేద, హెూమియో, యునాని వైద్య సేవలను భక్తులకు అందజేస్తారు. ఆయుర్వేద, హెూమియో, వైద్య విధానాలను పాటించే ప్రజలు ఇప్పటికీ చాలామంది ఉ న్నారు. అనారోగ్యానికి గురైనప్పుడు వీరు ఈ వైద్య సేవలను ఎక్కువగా పొందుతుంటారు. అలాంటివారు జాతర సందర్భంగా అనారోగ్యానికి గురైనప్పుడు వారికి ఉచిత వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకు వీలుగా ఆయుష్ ఆధ్వర్యంలో వైద్య వైద్య శిబిరాన్ని మేడారంలో ఏర్పాటు చేశారు. మేడారం జాతర ప్రాంగణంలో ప్రస్తుతము నిర్వహిస్తున్న అలోపతి సమీపంలోనే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయుష్ ప్రాంతీయ ఉపసంచాలకులు తెలిపారు. ఈ మూడు వైద్య విధానాలకు చెందిన డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది, ఫార్మసిస్టులు శిబిరంలో అందుబాటులో ఉంటారని చెప్పారు. షిఫ్టులవారీగా వీరు సేవలను అందజేస్తారని తెలిపారు. ప్రతి జాతర సందర్భంగా ఈ ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, భక్తుల నుంచి మంచి స్పందన వస్తోందని రవి నాయక్ తెలిపారు. భక్తులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now