మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్కు ఘన స్వాగతం

Written by telangana jyothi

Published on:

మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్కు ఘన స్వాగతం

ములుగు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గా నియమించబడ్డ డాక్టర్ మోహన్ లాల్ కు డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ యూనియన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ములుగు హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జగదీష్  ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది ప్రిన్సిపాల్ కు పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ సుర్జిత్, డాక్టర్ రఘు, నర్సింగ్ సూపరింటెండెంట్ సరోజినీ దేవి, హెడ్ నర్సులు విజయలక్ష్మి, పద్మావతి, పారామెడికల్ సిబ్బంది జగ్గు నాయక్, ఆఫీస్ ఉద్యోగులు, సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు శ్రీకర్, శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment