ములుగు సోషల్ వెల్ఫేర్ గురుకులం భవనంపై నుంచి కిందపడ్డ విద్యార్థిని

Written by telangana jyothi

Updated on:

ములుగు సోషల్ వెల్ఫేర్ గురుకులం భవనంపై నుంచి కిందపడ్డ విద్యార్థిని 

– మూడవ అంతస్తుపై నుంచి పడటంతో నడుముకు తీవ్ర గాయం

– భవనం పై నుండి విద్యార్థిని కింద పడడంపై అనుమానాలు..?

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకులం భవనంపై నుంచి విద్యార్థిని కింద పడ్డ   సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం… ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన కొయ్యడ సుమలత రాజు (లేట్) దంపతుల కుమార్తె కార్తీక శ్రీ ములుగులోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 9వతరగతి చదువుతోంది. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో ప్రమాదవశాత్తు భవనం మూడవ అంతస్థుపై నుంచి కింద పడటంతో తీవ్రగాయాలు కాగా వెంటనే ఉపాధ్యాయులు తల్లికి సమాచారం అందించి ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిం చిన అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం హన్మకొండలోని ప్రైవేటు ఆస్పత్రితో విద్యార్తిని చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. విద్యార్తిని కార్తీక శ్రీ కి తొంటి భాగం విరిగినట్లు వైద్యులు చెప్పినట్లు పేరెంట్స్ తెలిపారు. తెలిసిన వివరాల ప్రకారం.. ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన కొయ్యడ సుమలత రాజు (లేట్) దంపతుల కుమార్తె కార్తీక శ్రీ ములుగులోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 9వతరగతి చదువుతోంది. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో ప్రమాదవశాత్తు భవనం మూడువ అంతస్థుపై నుంచి కింద పడటంతో తీవ్రగాయాలు కాగా వెంటనే ఉపాధ్యాయులు తల్లికి సమాచారం అందించి ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం హన్మకొండలోని ప్రైవేటు ఆస్పత్రితో విద్యార్తిని చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. విద్యార్తిని కార్తీక శ్రీ కి తొంటి భాగం విరిగినట్లు వైద్యులు చెప్పినట్లు పేరెంట్స్ తెలిపారు. అయితే విద్యార్థిని భవనంపై నుంచి ప్రమాద వశాత్తు కిందపడిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా తెలియరాలేదు. ఈ విషయంపై ప్రిన్సిపల్ నర్మదను వివరణ కోరగా తాను స్కూల్ లోప్రిన్సిపల్ గా 15రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించానని, విద్యార్థిని కొద్దిరోజుల నుంచి అబ్నార్మల్ గా వ్యవహరిస్తోందని తెలిపారు. అందరం స్కూల్ విధుల్లో ఉండగా భవనంపై నుంచి విద్యార్థిని కిందపడిందన్నారు. పోలీసులు ఈ సంఘటనపై విచారణ చేపట్టారు.

Leave a comment