ఘనంగా ప్రపంచ ఆదివాసిఘనంగా దినోత్సవ వేడుకలు 

Written by telangana jyothi

Published on:

ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు 

– ఆదివాసి లతో హోరెత్తిన వెంకటాపురం : కిటకిటలాడిన రోడ్లు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసి పేరంటాలు జేజ్జరి నారాయణమ్మ ముందుగా కొమరం భీమ్ చిత్రపటానికి కొబ్బరికాయ కొట్టి ఉత్సవాలను ప్రారంభిం చారు. అనంతరం ఆదివాసి నాయకులు వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి రవికుమార్, సబ్ ఇన్స్పెక్టర్ కొప్పుల తిరుపతి రావు,  మండల తాసిల్దార్ లక్ష్మీరాజయ్య ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్, ఐసిడిఎస్ సిడిపిఓ ముత్తమ్మ, మండల ప్రత్యేక అధికారి స్వర్ణలత లేనిన తదితర అదికారులు కొబ్బరి కాయలు కొట్టి కొమరం భీం విగ్రహానికి పూల మాలలు వేశారు. వెంకటాపురం మండల కుల పెద్ద అయినా పాయం నాగేశ్వరావు ఆదివాసి జెండాలు ఆవిష్క రించారు. అనంత రం వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాల నాయకుల పోరాట ఫలితమే ఆదివాసులకు ప్రపంచ ఆదివా సి దినోత్సవం గా ఐక్యరాజ్యసమితి 1994లో గుర్తించిందని అన్నారు. భారత రాజ్యాంగ బద్దంగా ఆదివాసీలకు హక్కులు, చట్టాలకు లోబడి పని చేయాలన్నారు.5వ షెడ్యూల్ లో భాగంగా ఉన్నటువంటి హక్కులు, చట్టాలను పటిష్టంగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఆదివాసి నేతలు డిమాండ్ చేశారు .అలాగే ఆదివాసి సంఘాల ఐక్యవేదిక నాయకులు పూనెం సాయి, పూనెం రామచంద్రరావు, పర్సిక సతీష్, యాసం రాజు ,చింత సోమరాజు, కనితి వెంకటకృష్ణ, కుంజ మహేష్ మాట్లాడుతూ ఆదివాసీలు భవిష్యత్ తరాల కోసం ఉద్యమాలు చేయాల్సి నటువంటి అవసరం ఉంద న్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం ఆదివాసీల అభివృ ద్ధికి నిరంతరం కృషి చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 100% ఉద్యోగ అవకాశాలు కల్పించే జీ.ఒ నెంబర్.3 ను ఆర్డినెన్స్ ద్వారా చట్టం చేయాలని కోరారు. తక్షణమే ఆదివాసి భూ సమస్యలను పరిష్కరించి సాగులో ఉన్న ఆదివాసులకు అసైన్మెంట్ పట్టా లు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంత రం కొమురం భీమ్ సెంటర్ నుండి వేప చెట్టు సెంటర్ వరకు ఆదివాసి సంస్కృతి, సాంప్రదాయాలతో నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూనెం మనేశ్వర రావు, తాటి లక్ష్మణ్, తుర్సకృష్ణ బాబు, తుర్స చంటి, ఆట సభ్యులు తోలేం చిరంజీ వి, సిద్ధిబోయిన భుజంగరావు, బోదె బోయిన జయరాం, శేష నర్సిరావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment