స్కీం వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలి
– సీఐటీయూ డిమాండ్
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : స్కీమ్ వర్కర్లకు 14, 15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసుల ప్రకారం కనీస వేతనంగా రూ.26వేలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అందించాలని సిఐటియు జిల్లా నాయకులు మడి రవి, బొగ్గు సరిత డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆల్ ఇండియా కమిటీ పిలుపుమేరకు డిమాండ్స్ డే కార్యక్రమంలో భాగంగా స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తాసిల్దార్ జగదీశ్వర్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ విధానాలు వేగంగా అమలు జరుపుతున్నా యని, ఇప్పటికే 44కార్మిక చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్ కోడ్లను రూపొందించిందని అన్నారు. లేబర్ కోడ్ల వలన కార్మికుల కనీస వేతనాలు పడిపోతాయని, కార్మికుల హక్కులు కాలరాయబడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి.స్వరూప, ఎం.వినోద, యండి.కాసింబి, రాజ్యలక్ష్మి, కే.సరిత, డి.వరలక్ష్మి, కె.రాణి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.