వృద్ధాశ్రమములో ఇస్సార్ ఖాన్ జన్మదిన వేడుకలు
– ప్రభుత్వ ఆసుపత్రి లో పండ్లు మిఠాయిలు పంపిణీ
మంగపేట, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రంలోని కస్తూరి బాయి వృద్ధాశ్రమంలో బుధవారం ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఇస్సార్ ఖాన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషంట్లకు, వృద్ధాశ్ర మంలోని వృద్ధులకు మిఠాయిలు, పండ్లను కాంగ్రెస్ పార్టీ మండల యూత్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమ ములో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్, మండల ప్రధానకార్యదర్శి చెట్టుపల్లి ముకుందాం ,యువజన కాంగ్రెస్ నాయకులు కస్పా ముకుందం ఎడ్ల నరేష్, మల్యాల నరేష్, గద్దల సాయి మద్దెల ప్రవీణ్,బోడ సతీష్,బేత వెంకటేష్, ఎల్పి కిరణ్, కర్రీ సిద్దు, మూగల చంటి, కుమార్, మురళి తదితరులు పాల్గొన్నారు.