మే డే రోజున భవన నిర్మాణ కార్మిక కుటుంబానికి చేయూత
– స్వయం కృషి స్వచ్ఛంద సంస్థకు అభినందన వెల్లువ
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్ర ఎర్రగుంటపల్లె ( గారపల్లి ) గ్రామ నివాసి ఇటీవల చనిపోయిన గోనె రాజన్న కుటుంబానికి కాటారంకు చెందిన స్వయంకృషి స్వచ్ఛంద సేవా సంస్థ చేయూత ను అందించారు. సభ్యుల ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులైన బియ్యం, వంటనూనె, పప్పు దినుసులు, ఇంట్లోకి కావాల్సిన కనీస పరికరాలైన ఫ్యాన్, కుర్చీలు అందజేశారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ అనారోగ్య కారణంగా కొన్ని రోజుల క్రితం చనిపోయిన గోనె రాజన్నకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ల ఆర్థిక పరిస్థితి తెలుసు కొని వారికి తమ వంతు సహాయం చేశామని అలాగే మరి కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కొట్టే సతీష్ తెలిపారు. ఈ సేవ కార్యక్రమంలో స్వయంకృషి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు , ఎర్రగుంట పల్లి వాసులు పాల్గొన్నారు.