ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర బృందం
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కేంద్ర బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాథమిక కేంద్రంలో వివిధ భాగాలలో సందర్శించి అందుతున్న సేవలు గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృంద సభ్యులు డా అనురాధ మేడోజు, డా పర్వీన్ సుల్తానా, డిఎంహెచ్ఓ మధుసూదన్, డిప్యూటీ డిఎంహెచ్వో కొమరయ్య, ప్రోగ్రాం ఆఫీసర్ డా శ్రీదేవి , డా ఉమా, డా ప్రమోద్ కుమార్, డా నాగరాణి, మండల మెడికల్ ఆఫీసర్ డా మౌనిక, డిపిఓ చిరంజీవి, డిస్టిక్ క్వాలిటీ మేనేజర్ భాను ప్రకాష్, ఎస్ హెచ్ఓ నిర్మల, హెచ్ వి పద్మావతి, సరళ వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.