ఏబీవీపీ బడుల బందు విజయవంతం
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఏబీవీపీ భూపాలపల్లి నగర కార్యదర్శి రాజా బాబు ఆధ్వర్యంలో కాటారం మండలంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు విద్యారంగ సంస్థలను స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలం లో ఉన్న తోటి కార్యకర్తలు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల విద్యారంగం పట్ల మొండి వైఖరి చూపిస్తుందని, వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ఎంఈఓ డీఈవో పోస్టులను భర్తీ చేయాలని, సరైన సమయంలో పాఠ్యపుస్తకాలు ఏకరూప దుస్తులను అందజేయాలని డిమాండ్చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాదేవపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో నగర కార్యదర్శి పేట సాయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల విద్యారంగం పట్ల మొండి వైఖరిని చూపిస్తుందని, ప్రైవేటు పాఠశాలలో అక్రమంగా ఫీజులు దోపిడీ చేస్తూ విద్యార్థులను వేధిస్తున్నారని, ప్రైవేటు పాఠశాలలో అక్రమంగా పుస్తకాలు యూనిఫామ్ అమ్మడం ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అలాగే వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భారీ చేయాలని, జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించాలని లేదంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్, మింటు ,సాయి, ఆకాష్, రవితేజ, పాల్గొన్నారు.