కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి చేరికలు
ములుగు ప్రతినిధి : ఏటూరునాగారం మండలం దొడ్ల కొత్తూరు గ్రామానికి చెందిన పలువురు యువకులను ములుగు జడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సిఏం కేసిఆర్ దేనని బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ది సాద్యమని ఆలోచించిన యువత ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఆకర్శితులై బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆమె అన్నారు. బీఆర్ఎస్ లో చేరిన వారిలో సబ్కా భరత్, మాడాది సమ్మయ్య, శ్యాముల సాంబు, పునెం సాంబయ్య, సోయం మహేష్, సోమయ్య, తాటి నారాయణ తదితరులు ఉన్నారు. ఆమె వెంట రెడ్ కో చైర్మన్ వై సతీష్ రెడ్డి ఉన్నారు.