బాధిత కుటుంబానికి అండగా చక్రవర్తిపల్లి గ్రామస్తులు

బాధిత కుటుంబానికి అండగా చక్రవర్తిపల్లి గ్రామస్తులు

వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : చక్రవర్తి పల్లి గ్రామపంచాయితీ పరిధి ఆనందాపూర్ లో ఇటీవల నిరుపేద కుటుంబానికి చెందిన భూక్య సమ్మయ్య మరణించగా గ్రామస్తులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. శనివారం సాయంత్రం గ్రామస్తులంతా కలిసి 21,500 ల రూపాయలను సమ్మయ్య కుమారుడు సిద్దుకు అందించారు. కష్టాల్లో ఉన్న తోటి వ్యక్తికి ఆసరాగా నిలిచేందుకు గ్రామస్తులంతా అప్పటికప్పుడు తమ వంతు సహకారం అందించడం పట్ల ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. కార్యక్రమం లో చక్రవర్తి పల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment