ఆత్మవిశ్వాసంతో దేనినైనా జయించవచ్చు
ములుగు, తెలంగాణ జ్యోతి : ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసంతో దేనినైనా జయించవచ్చునని మానుకోట సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ సాయం అందించిన తస్లీమా మానవత్వాన్ని చాటుకున్నారు. ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన V6 జర్నలిస్ట్ కుంచం రమేష్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం మీడియా మిత్రుల ద్వారా తెలుసుకొని ఆదివారం వెళ్ళి అతన్ని పరా మర్శించి 25 వేల రూ. ఆర్థిక సహాయం అందించారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ సమస్య ఉంటుందని, ఎలాంటి సమస్యనైనా ఆత్మవిశ్వాసంతో జయించి, మనో ధైర్యంతో ముందుకుసాగాలని తస్లీమా అన్నారు. అదైర్య పడొద్దు అక్కగా అండగా ఉంటానని తస్లీమా అన్నారు. తస్లీమా వెంట మీడియా ప్రతి నిధులు, సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు.