జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి జిల్లా స్థాయి సైన్స్ సంబరాలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ఏటూరు నాగారం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో జన విజ్ఞాన వేదిక జిల్లా కోఆర్డినేటర్ కే. మల్లయ్య ఆధ్వర్యంలో చెకుముకి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎటుర్నాగారం జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు సాంబశివ రావు హాజరై ప్రశ్న పత్రాలను విడుదల చేశారు. ఈ పోటీలలో సైన్స్ సంబరాలలో పాల్గొనడానికి జిల్లాలోని తొమ్మిది మండలాల నుండి ఇంగ్లీష్ మీడియం నుండి ఒక్కొక్క టీం. తెలుగు మీడియం నుండి ఒకటి. ప్రైవేట్ పాఠశాల నుండి ఒక్కోటి మండల స్థాయిలో ప్రధాన స్థానం నిలిచిన జట్లు మొత్తం 21 టీంలు గా పాల్గొన్నారు. ఇక్కడ నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన ఆరు టీం లకు మీడియంలో వారిగా విభాగల వారీగా విజువల్ రౌండ్ నిర్వహించడం జరిగింది.విజువల్ రౌండ్ లో ప్రథమ స్థానం సాధించిన ఒక్కొక్క జట్టును రాష్ట్రస్థాయికి అర్హులుగా ఎంపిక చేయడం జరిగింది.ఇందులో ప్రభుత్వ స్కూల్లలో ఇంగ్లీష్ మీడియం విభాగంలో గోవిందరావుపేట మండలం లోని చల్వాయి జెడ్పిహెచ్ఎస్ ప్రథమ స్థానం , ప్రభుత్వ తెలుగు మీడియం పాఠశాలల విభాగంలో వెంకటాపురం నుగురు జడ్పిహెచ్ఎస్ ప్రథమ స్థానం మరియు ప్రవేట్ పాఠశాల విభాగంలో గోవిందరావుపేట మండలం లోని దసరా గ్రామ సెయింట్ మేరీ స్కూలు లు ప్రథమ స్థానాలు సాధించాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జట్టుకు ప్రతి విద్యార్థికిసర్టిఫికెట్లు బహుమతులుగా విజ్ఞానమంతమైన ప్రశ్నించే పుస్తకాలను బహుమతులు గా ఇవ్వడం జరిగింది.ఈ జట్లు ఈనెల 9 10 11 తేదీలలో జనగామలో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ సంబరాలలో పాల్గొనుటకు అర్హతను సాధిం చాయి. ఈ సందర్భంగా జిల్లా జెవివి కోఆర్డినేటర్ కె .మల్లయ్య మాట్లా డుతూ విద్యార్థులను అభినందిస్తూ రాష్ట్రస్థాయిలో కూడా ప్రథమ స్థానం సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థు లను ఉపాధ్యాయులను ఉద్దేశించి జెవివి పర్యావ రణ విభాగం బాధ్యులు భాస్కర్ రావు మాట్లాడుతూ పర్యావరణం పట్ల అవగాహన పెంచుకుంటూ సైంటిఫిక్ టెంపర్ పైన అవగాహన కలిగి ఉంటూ విద్యార్థులు బంగారు భవిష్యత్తు కొరకు టెంపర్ తో మెలుగుతూ దేశాన్ని ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలపాలన్నారు.ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా కోశాధికారి దామోదర్,జెవివి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్, నర్సింగ్, జెవివి కార్యదర్శులు కిరణ్ శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ఎల్ రవి,రవితేజ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ జెవివి కార్యకర్తలు ధనుష్ స్వామి డి వై ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు బొచ్చు సంజీవ జిల్లాలోని వివిధ వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన చేసిన ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.