ప్రజలు భయభ్రాంతులకు గురి కావొద్దు : కలెక్టర్ దివాకర

Written by telangana jyothi

Published on:

ప్రజలు భయభ్రాంతులకు గురి కావొద్దు : కలెక్టర్ దివాకర 

– చెట్లు కూలడానికి భూకంపానికి సంబంధం లేదు

      తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : సమ్మక్క సారలమ్మ దీవెనలతోనే బుధవారం ఉదయం సంభవించిన భూకంపంతో జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అన్నారు. సమ్మక్క సారలమ్మ దీవెనల తోనే బుధవారం ఉదయం సంభవించిన భూకంపంతో జిల్లా లో ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ అన్నారు. బుధవారం సాయంకాలం తాడ్వా యి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. దర్శించుకున్నారు.అనంతరం మేడారంలోని అమ్మవార్ల పూజారులతో ప్రత్యేక సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 31 న దట్టమైన అటవీ ప్రాంతంలో టోర్నోడు కారణంగా వేలాది చెట్లు నేలమట్ట కావడానికి, ఈరోజు ఉదయం జరిగిన భూకంపానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భూమిలో జరిగిన కొన్ని చర్యల వలన భూకంపం వస్తుందని, భూమిపైన జరిగిన కొన్ని చర్యల వలన చెట్లు కూలిపో తాయని తెలిపారు. రెండు సంఘటనలు ములుగు జిల్లాలోని జరగడంతో జిల్లా ప్రజల ఆందోళన చెందుతున్నారని ఇలాంటి సంఘటన జరగడం సహజమని అన్నారు. బుధవారం ఉదయం 7 గంటల 27 నిమిషాల సమయం లో 6 సెకండ్ల నుండి 8 సెకండ్ల మధ్యన భూకంపం సంభవించిందని, దీంతో జిల్లాలో జరిగిన నష్ట వివరాలను తెలుసుకోవడం కోసం అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు పూర్తి వివరాలను తీసుకోవడం జరిగిందని, ఒకచోట పాక్షికంగా ఇల్లు దెబ్బ తిన్నట్లు అధికారులు వివరించారని తెలిపారు. ఈరోజు ఉదయం జరిగిన సంఘటనతో తాను సైతం తన ఇంటి నుండి బయటకు వచ్చానని, ఇలాంటి సంఘటన జరిగి న సమయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధికా రులకు తెలియజేయాలని అన్నారు. కలెక్టర్ వెంట మేడారం ఈవో రాజేందర్, అమ్మవార్ల పూజారులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now