రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
వెంకటాపురంలో ఘనంగా వర్ధంతి నిర్వహణ
వెంకటాపురం నూగూరు, మే 21, తెలంగాణ జ్యోతి: స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరవరానివని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. గురువారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని, నవయువ స్ఫూర్తితో దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన ధీరోదాత్త నాయకుడిగా ఆయనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ధనపనేని వెంకటేశ్వర్లు, మన్యం సునీల్, వెంకటాపురం మేజర్ పంచాయతీ సర్పంచ్ తాటి సరస్వతి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్టెం సాయి, సీనియర్ నాయకులు చిట్టెం టాకయ్య, పల్నాటి నాగేశ్వరావు, కాల్వ సుందర్రావు, సీతాదేవి, రవి, వేల్పూరి సత్యనారాయణ, జి. నాగేశ్వరరావు, మద్దుకూరి ప్రసాద్, ఆర్కేతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.








