నూతన కలెక్టర్‌ను సన్మానించిన గ్రంథాలయ చైర్మన్
ములుగు, మే 13, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాకు నూతనంగా బదిలీపై వచ్చిన కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావును బుధవారం ములుగు కలెక్టరేట్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ మర్యాదపూర్వకంగా కలిసిశాలువాతో సన్మానించిశుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా కలెక్టర్‌ను అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు జక్కుల రేవంత్ యాదవ్, డీసీసీ మాజీ అధ్యక్షుడు కునూరు అశోక్ గౌడ్, జిల్లా నాయకులు లక్కీ, సర్పంచ్ శ్రీను, మజామిల్, విజయ్ యాదవ్, యూత్ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు నాంపల్లి సుమన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.









