ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 557 మంది హాజరు
ములుగు, మే 13, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎన్. వీరేందర్ తెలిపారు. 2వ భాష పేపర్-1 పరీక్షకు మొత్తం 582 మంది విద్యార్థులకు అవకాశం ఉండగా 557 మంది హాజరై, 25 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు, అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారని తెలిపారు.









