విజ్ఞానజ్యోతి సావిత్రీబాయి ఫూలే
– సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్
మహబూబాబాద్, తెలంగాణ జ్యోతి : సమాజంలో ఉన్న అస మానతలు, కుల, మత, లింగ వివక్షతను రూపుమాపడం కోసం అందరికీ విద్య అందేలా చేసిన విజ్ఞానజ్యోతి సావిత్రీబాయి ఫూలే ను ఆదర్శంగా తీసుకోవాలని మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. సావిత్రీబాయి ఫూలే 193వ జయంతి సందర్భంగా బుధవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సావిత్రీ బాయి చిత్ర పటానికి పూలమాల వేసి జయంతి వేడుకలు నిర్వ హించారు. జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో నిర్వ హించిన సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలలో తస్లీమా పాల్గొ ని జ్యోతి ప్రజ్వలన చేశారు. మా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వ హించిన సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలలో పాల్గొన్నా రు. కళాశాలలో మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో తస్లీమా సన్మానించారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ సావిత్రీబాయి ఫూలే తన జీవితాన్ని త్యాగం చేసి విద్య బోధనకు అంకితం చేశా రని, సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అని తస్లీమా కొనియాడారు. సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త సావిత్రీబాయి ఫూలే అని, ఆడపిల్లలు ఆమెను ఆదర్శంగా తీసుకొని విద్యను అభ్యాసించా లని తస్లీమా అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, మహిళలు, కళాశాల ప్రిన్సిపాల్,ఉపాధ్యాయులు, విద్యార్థులు,ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
1 thought on “విజ్ఞానజ్యోతి సావిత్రీబాయి ఫూలే”