ఇంటింటికి అయోధ్య రాముడి అక్షింతల పంపిణీ.
– జై శ్రీరామ నినాదాలతో మారుమోగుతున్న గ్రామాలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆధ్వర్యంలో, అయోధ్య రాముడి అక్షింతలను పంపిణీ చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర కమిటీ ఆదేశాల మేరకు, ములుగు జిల్లా వెంకటాపురం, వాజే డు మండలాల్లో అయోధ్య శ్రీరామచంద్రమూర్తి యొక్క అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని భక్తులు చేపట్టారు. ముఖ్యం గా మహిళా భక్తులు, భక్త సోదరీమణులు పెద్ద సంఖ్యలో అక్షింతల పంపిణీ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొని, అయోద్య శ్రీరామ జన్మభూమిలో నిర్మాణం అవుతున్న దివ్య మందిరం శుభ సంధ ర్భంగా శ్రీ రామ అక్షింతలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఇంటిం టికి శ్రీరామ జన్మభూమి అక్షింతల పంపిణీ కమిటీలు వేసుకొని పంపిణీ చేసే కార్యక్రమాలను మమ్మురం చేశారు. అలాగే శ్రీ రామ అక్షింతలను గ్రామాల్లోకి రాగా భక్తులు జై శ్రీరామ, జై సీతా రామాం జనేయ అంటూ స్వాగతం పలుకుతూ మేళతాళాలతో పంపిణీ చేసే కార్యక్రమాన్నిఆయా దేవాలయాల్లో పూజలు నిర్వహించి శ్రీరామ్ అంటూ అయోధ్య శ్రీరామచంద్రమూర్తి అక్షింతలను ఇంటింటింటికి పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలం గ్రామాలతో పాటు ముఖ్యంగా వెంకటాపురం పట్టణంలోని అనేక వీధులలో కమిటీలు వేసుకొని, జై శ్రీ రామ, జై జై సీతా రామ ఆంజనేయ అంటూ అక్షింతలను, శ్రీరామచంద్రమూర్తి జన్మభూమి మందిరం కరపత్రాలను భక్తులకు అందజేసి అక్షింతల ను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. జనవరి 22వ తేదీ అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరం , శ్రీరామచంద్రమూర్తి యొక్క అక్షింతలను పవిత్రమైనదిగా భావించి, పూజా కార్యక్రమాలు నిర్వహించి, శ్రీరామ, జయ,జయ రామ, జయ జయ రామ అంటూ భక్తులు అశేష జనకోటి శ్రీరామ జన్మభూమి తీర్థయాత్ర అక్షింతలను శిరస్సుపై ధరించి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు పొందాలని, విశ్వవ్యాప్త రామ భక్తులకు భక్తమం డలి, జైశ్రీరామ్ అంటూ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వెంకటాపురం మండలంలో అనేకమంది భక్త మహాశయులు, ముఖ్యంగా మహిళా భక్త సోదరీమణులు పెద్ద సంఖ్యలో కమిటీలు గా ఏర్పడి శ్రీరామ జన్మభూమి అక్షింతలను స్వామివారి కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ జై శ్రీరామ, జై శ్రీ సీతారామాంజనేయ అంటూ అంక్షిం తలు పంపిణీ చేసే భక్తి రస కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
1 thought on “ఇంటింటికి అయోధ్య రాముడి అక్షింతల పంపిణీ. ”