ఫ్లెక్సీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సలుపాల శ్రీనివాస్

On: April 20, 2026 5:11 PM

ఫ్లెక్సీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సలుపాల శ్రీనివాస్

ఫ్లెక్సీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సలుపాల శ్రీనివాస్

ములుగు, ఏప్రిల్20,తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా ఫ్లెక్సీ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సలుపాలశ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యక్షులుగా ఎండి అలీ, సర్వేష్ (ఏటూరునాగారం), కార్యదర్శులుగా మాట్ల బద్రి, షరీఫ్, కోసర వేణు (పస్ర), కోశాధికారిగా గడ్డం శ్రీను, ప్రచార కార్యదర్శులుగా చంద్రగిరి మురళీకృష్ణ, మాదారపు రాజులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సలుపాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఫ్లెక్సీ షాపుల నిర్వహణకు అధిక వ్యయభారం ఉంటోందని, ప్రింటింగ్ ఉత్పత్తుల ధరలు పెరగడంతో తమ సేవల ధరలను స్వల్పంగా పెంచాల్సి వచ్చిందని తెలిపారు. వినియోగ దారులు సహకరించాలని కోరుతూ, యూనియన్ నిబంధనలకు అను గుణంగా అన్ని షాపులు పనిచేయాలని సూచించారు. తమ ఎన్నికకు సహకరించిన సభ్యులకు కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ములుగు, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపూర్ మండలాలకు చెందిన ఫ్లెక్సీ షాప్ యజమానులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!