పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన

On: April 20, 2026 11:27 AM

పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన

పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన

వెంకటాపురం, ఏప్రిల్20, తెలంగాణజ్యోతి:ములుగుజిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని విజన్ స్కూల్ విద్యార్థులు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. సామాజిక అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ సందర్శనలో ఎస్సై తిరుపతిరావు పోలీస్ శాఖ విధులు, బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్టేషన్‌లోని వివిధ విభాగాల పనితీరు, కేసుల నమోదు, విచారణ విధానాలను సులభంగా వివరించారు. ప్రజల భద్రత కోసం పోలీసులు చేపట్టే చర్యలను వివరించారు. రోడ్ సేఫ్టీ, చట్టాల పట్ల గౌరవం, అత్యవసర పరిస్థితుల్లో స్పందన వంటి అంశాలపై సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో పరస్పర చర్చ నిర్వహించి వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. అలాగే వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, లక్ష్య సాధనపై ప్రేరణాత్మక సందేశాలు అందించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై సమగ్ర అవగాహన కల్పించారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!