హిందూ ఐక్యత గర్జనకు ములుగు సిద్ధం

On: April 17, 2026 7:54 PM

హిందూ ఐక్యత గర్జనకు ములుగు సిద్ధం

హిందూ ఐక్యత గర్జనకు ములుగు సిద్ధం

హాజరు కానున్న శ్రీ కమలానంద భారతి స్వామీజీ

 ఏర్పాట్లు పూర్తి చేసిన ఉత్సవ సమితి

ములుగు,ఏప్రిల్17, తెలంగాణ జ్యోతి: ములుగులో హిందూ సమ్మేళనం, హిందూ ఐక్యత గర్జనలో భాగంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ తెలిపారు. సభ్యులతో కలిసి ఈనెల 18న ములుగు లోని మంజునాథ పురం (రావణవధ ఉత్సవ స్థలం) ఆవరణలో జరుగ నున్న సభా ప్రాంగణాన్ని శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ములుగులో జరిగే హిందూ సమ్మేళన కార్యక్రమానికి శ్రీ భువనేశ్వరి దేవి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ, ధర్మజాగరణ అఖిల భారత సహ సంయోజక్ ఏలె శ్యాంకుమార్ జీ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులు, మండలంలోని వివిధ గ్రామాల్లో జాగరణ చేపట్టామని వెల్లడించారు. వేలాది సంఖ్యలో సభకు తరలిరానున్నారని అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనాలని, ఇంటింటికీ పంపిణీ చేసిన నవధాన్యాలను తీసుకువచ్చి యాగంలో సమర్పించాలని సూచించారు. సమ్మేళనానికి హాజరయ్యే ప్రజలకు వివిధ గ్రామాల నుంచి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బిట్స్ స్కూల్ గ్రౌండ్ లో, బైక్ లకు సాధన స్కూల్ వెనుక భాగంలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని, సుమారు పది వేల మందికి సరిపడే విధంగా సభాప్రాంగణంలో అన్ని వసతులు కల్పించామని తెలిపారు. సాయంత్రం 4గంటలకు ప్రారంభమయ్యే హిందూ సమ్మేళనం కార్యక్రమంలో భాగస్వాములై సభను సక్సెస్ చేసేందుకు అధిక సంఖ్యలో తరలిరావాలని కుమార్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కర్ర రాజేందర్ రెడ్డి, వాంకుడోతు జ్యోతి, దిడ్డి రాజ్ కుమార్, చింతలపూడి భాస్కర్ రెడ్డి, సిరికొండ బలరాం, దొంతి రెడ్డి వాసుదేవ రెడ్డి, బాణాల సుధాకర్, ఇమ్మడి రాకేష్ యాదవ్, ప్రకాష్, కొత్తపల్లి బాబురావు, గొల్ల కుమార్, కొత్తపల్లి పోషన్న, కంది జీవన్ రెడ్డి, , సభావట్ రమేష్ డాక్టర్ సకినాలజీవన్ చంద్రం,, మేకుల సంపత్,గొర్రెకుంట అయిలు మల్లు, దాసు రాములు, గొల్ల కుమార్, వేములపల్లి రాజు, పాలకుర్తి తిరుపతి, పులి ప్రకాష్, జక్కుల వేణు, మేడుదుల మమన్, జక్కుల వేణు తొడుపునూరీ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!