స్వధర్మంలోకి చేరిన మహిళలు

On: April 17, 2026 6:51 PM

స్వధర్మంలోకి చేరిన మహిళలు

స్వధర్మంలోకి చేరిన మహిళలు

హోమయాగాలతో స్వాగతం పలికిన పండితులు

గోవిందరావుపేట, ఏప్రిల్17, తెలంగాణ జ్యోతి : కొన్నేళ్లుగా అన్యమతం లో ఉంటూ తిరిగి స్వధర్మంపై మక్కువతో 15మంది మహిళలు హైందవ మంతంలోకి మారారు. వారికి వేదపండితులు మంత్రోత్సారణల నడుమ ఘన స్వాగతం పలికారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన 15మంది మహిళలు అన్యమతం నుంచి హిందూమతంలోకి మారారు. హైందవ ధర్మం గొప్పదనం తెలుసుకొని అన్యమతం నుంచి హైందవ మతంలోకి చల్వాయి గ్రామంలో గల బ్రహ్మసూత్ర మిళిత సూర్య ప్రభావిత శోభిత శంకు చక్ర హనుమాన్ సహిత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వేద పండితుల మంత్రోత్సారణల నడుమ హోమం నిర్వహించారు. ప్రదక్షిణ చేసి అన్యమతంలోకి చేరి తాము చేసిన పాపాలు తొలగిపోవాలని తిరిగి హిందూ ధర్మంలోకి చేరినట్లు 15 మంది మహిళలు వెల్లడించారు. వీరిలో తాడ్వాయి మండలం కామారం గ్రామానికి చెందిన నలుగురు, చల్వాయికి చెందిన 11మంది మహిళలు ఉన్నారు. భవిష్యత్తులో హిందూ ధర్మం ఒకటే ప్రపంచానికి మార్గదర్శకమని వారు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!