హిందూ సమ్మేళనం సక్సెస్ చేయాలి
ఉత్సవ సమితి అధ్యక్షుడు కుమార్
ములుగులో భారీ బైక్ ర్యాలీ
ములుగు, ఏప్రిల్ 15, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలో ఈనెల 18న నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని హిందూ బంధువులందరూ తరలిరావాలని ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ పిలుపునిచ్చారు. ఈమేరకు బుధవారం ములుగులో హనుమాన్ జెండాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు 550బైక్ లతో డీఎల్ఆర్ గార్డెన్ నుంచి మొదలుకొని 20వార్డుల్లో శోభాయాత్ర నిర్వహించగా అందులో 200లమంది హనుమాన్ మాలధారణ భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ.. 18న జరిగే హిందూ సమేళనంలో ములుగు ప్రాంతానికి చెందిన ప్రతీ ఒక్కరూ విధిగా పాల్గొని సక్సెస్ చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతీ స్వామీజీ, ప్రముఖ్ ఆధ్యాత్మిక వేత్త ఆలె శ్యాంజీలు హాజరు కానున్నారన్నారు. ఈ సందర్భంగా హోమం నిర్వహించనుండగా అందుకు సంబంధించిన నవధాన్యాలతో మహిళాలోకం పెద్ద ఎత్తున్న హాజరు కానున్నారని పేర్కొన్నారు. సుమారు 10వేల మంది బంధువులను ఈ సమ్మేళనానికి తరలించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.









