హనుమాన్ మాల విద్యార్థి స్కూల్ ఎంట్రీకి నిరాకరణ
భూపాలపల్లి, ఏప్రిల్ 15, తెలంగాణ జ్యోతి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ఉన్నత పాఠశాలలో హనుమాన్ మాల ధరించిన ఏడో తరగతి విద్యార్థి ఓంకార్‌ను పాఠశాలలోకి అనుమతించకుండా హెడ్మాస్టర్ ఝాన్సీ రాణి అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. మాలను తీసి వచ్చినప్పుడే పాఠశాలలోకి అనుమతిస్తామని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయంపై ప్రశ్నించిన విద్యార్థి తల్లిదండ్రులతో హెడ్మాస్టర్ దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు బజరంగదళ్ కార్యకర్తలతో కలిసి పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.









