వెంకటాపురం–వాజేడు మండలాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి
వెంకటాపురం,ఏప్రిల్14,తెలంగాణజ్యోతి:ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు గ్రామాల వారీగా ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, దళిత, గిరిజన సంఘాలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ సేవలను కొనియాడారు. వెంకటాపురం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సీఐ ముత్యం రమేష్, ఎస్ఐ కే. తిరుపతిరావుతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.









