అంజన్న మహా పడిపూజతో దద్దరిల్లిన గుడిగుట్ట ఆలయం.
– తరలివచ్చిన వందలాది శ్రీ ఆంజనేయ దీక్షా స్వాములు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రపురం పంచాయతీ పరిధిలోని అంక్కన్నగూడెం, రామచంద్రపురం గ్రామాల మధ్య వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి గుడి గుట్ట ఆలయంలో శనివారం రాత్రి అంజన్న స్వాముల మహా పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అంజన్న స్వాముల మహా పడిపూజ కార్యక్రమానికి వెంక టాపురం, వాజేడు మండలాలతో పాటు సమీపంలో ఉన్న చర్ల మండలాలనుండి కూడా వందలాదిమంది శ్రీ హనుమాన్ దీక్షాపరులైన స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేణుగోపాల గురు స్వామి ఆధ్వర్యంలో అంజన్న స్వాముల పడిపూజ కార్యక్ర మం శనివారం రాత్రి 8 గంటల ప్రాంతం నుండి ప్రారంభమై అర్ధరాత్రి వరకు స్వామివారి నామధేయంతో, జై శ్రీ ఆంజనేయ జై జై శ్రీ ఆంజనేయ జై హనుమాన్ అనే నామధేయంతో గుడి గుట్ట ఆంజనేయ స్వామి ఆలయం అటవీ ప్రాంతం దద్దరి ల్లింది. అలాగే చుట్టుపక్కల గ్రామాలుకు చెందిన భక్తులు, మహిళా సోదరీమణులు పెద్ద సంఖ్యలో మహా పడిపూజ కార్యక్రమాన్ని తిలకించేందుకు తరలి రావడంతో ప్రధాన రహదారి పక్కనే ఉన్న గుడి గుట్ట ప్రాంతం భక్తులు, అంజన్న స్వాముల దీక్షాపరులతో కిటకిటలాడింది.స్వామి వారి పూజా కార్యక్రమాలు అనంతరం స్వామి వారికి ఇష్టపూర్వకమైన ప్రసాదాలను గురుస్వాములు,ఆలయ పూజారి నైవేద్యంగా సమర్పించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భక్తుల నిరాజనాలు అందుకుం టున్న గుడిగుట్ట శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగే భక్తి రస కార్యక్రమానికి రామచంద్రపురం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో, మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విస్తృతమైన భక్తి రస కార్యక్రమానికి ఏర్పాట్లు గావించారు. దీక్షాపరులైన స్వామివారి మాల దారులకు అత్యంత నిష్ఠతో తయారుచేసిన ప్రసాదాలను భిక్షను, ఆలయ కమిటీ ఏర్పాటు చేసి స్వామి కృపకు పాత్రులు అయ్యారు. శ్రీ గడిగుట్ట శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగిన మహాపడి పూజ కార్యక్రమంతో ఈ ప్రాంతంలో భక్తి రస కార్యక్రమం, జై శ్రీ ఆంజనేయ జై జై శ్రీ ఆంజనేయ జై హనుమాన్ అనే నినాదాలతో మారుమోగింది. వెంకటాపురం, చర్ల ప్రధాన రహదారి పక్కనే ఉన్న శ్రీ గుడిగుట్ట ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద జరుగుతున్న భక్తి రస కార్యక్రమానికి ప్రధాన రహదారిపై నుండి రాకపోకలు సాధించే ప్రయాణికులు సైతం తమ వాహనాలను ఆపి స్వామివారికి నమస్కారాలు చేసి, ఆశీర్వాదాలు పొందారు.
1 thought on “అంజన్న మహా పడిపూజతో దద్దరిల్లిన గుడిగుట్ట ఆలయం. ”