వాజేడులో నూతన 63 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు వేగవంతం
వెంకటాపురం నూగూరు మార్చి 18, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలంలో విద్యుత్ సరఫరాను మెరుగుపర్చేందుకు సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా నూతన 63 కేవీఏ 3-ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులను విద్యుత్ శాఖ వేగవంతం చేసింది. ములుగు జిల్లా వాజేడు మండలంలో నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంగా పలు చర్యలు చేపడుతున్నట్లు వెంకటాపురం విద్యుత్ శాఖ డీఈ జె. పురుషోత్తం తెలిపారు. పీఎండీఏ జేజుయూఏ స్కీమ్ ద్వారా మీటర్లు లేని గిరిజనులకు ఉచితంగా మీటర్లు మంజూరు చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం వాజేడు గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోడెబోయిన స్వరూప, ఉప సర్పంచ్ మందపాటి సుబ్బరాజు గ్రామంలోని విద్యుత్ సమస్యలను డీఈ దృష్టికి తీసుకువెళ్లగా, వాటిని పరిశీలించి పరిష్కారం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏడీఈ బి. ఉమారావు, ఏఈ హర్షద్, ఏఎల్ఎం రాజేందర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.






