వెంకటాపూర్ జర్నలిస్టులది న్యాయమైన డిమాండ్

వెంకటాపూర్ జర్నలిస్టులది న్యాయమైన డిమాండ్

– ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చేవిధంగా కృషి చేస్తా

– బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి

– గుడిసెలు వేసుకున్న జర్నలిస్టులకు సంపూర్ణ మద్దతు

వెంకటాపూర్, నవంబర్ 26, తెలంగాణ జ్యోతి: వెంకటాపూర్ జర్నలిస్టులది న్యాయమైన డిమాండ్ అని బి ఆర్ ఎస్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. తమకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మండలం లోని పాలంపేట్ లో గల సర్వే నంబర్ 14లోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని గత కొద్దిరోజులుగా శాంతియుత దీక్ష చేపడుతున్నవిషయం తెల్సిందే. కాగా, ఆదివారం ఎన్నికల ఇంచార్జ్ సాంబారి సమ్మారావు తో కలసి నాగజ్యోతి పాలంపేట్ కు చేరుకొని జర్నలిస్టులకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా నాగజ్యోతి, సమ్మరావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతం చేసిన ఘనత జర్నలిస్టులదేనని అన్నారు. అలాంటి జర్నలిస్టుల కు కేసీఆర్ తప్పకుండా ఇండ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు పక్కా ఇండ్లు ఇస్తారని అన్నారు. వెంకటాపూర్ జర్నలిస్టులు పాలంపేట్ లో వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇప్పించడం తోపాటు పక్కా ఇండ్లు మంజూరు చేసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుర్ర రజిత, జెడ్పీటీసీ గై రుద్రమదేవి, బి ఆర్ ఎస్ నాయకులు మల్క రమేష్, డోలి శ్రీనివాస్, భాషబోయిన పోషాలు, లింగాల రమాణారెడ్డి, మందల శ్రీధర్ రెడ్డి, హర్జీ నాయక్ తో పాటు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment