మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి 

On: February 10, 2026 4:00 PM

మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి 

మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి 

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

ములుగు, ఫిబ్రవరి 10, తెలంగాణ జ్యోతి : ములుగు మున్సిపాలిటీలో బుధవారం జరుగనున్న తొలి పోలింగ్‌ ను సమర్థవంతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉందని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ విలువైన ఓటును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బ్యాలెట్ పత్రాల పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించి, పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామాగ్రిని చెక్‌లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే రూట్, మానిటరింగ్ అధికారులకు వెంటనే తెలియజేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల సామాగ్రితో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లోనే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, అధికారులు సూచించిన చోటే బస చేయాలని తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 83 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, సుమారు 13,500 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు. ఎన్నికల విధుల నిర్వహణ కోసం ఆర్వో, ఏఆర్ఓ, పీఓ, ఏపీఓలను నియమిం చడంతో పాటు ఎఫ్‌ఎస్‌సి, ఎస్‌ఎస్‌టీ బృందాలతో కలిపి వందమంది అధికారులను నియమించినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ కోసం సుమారు 40 కెమెరాలు ఏర్పాటు చేశామని, పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ పత్రాలను భద్రపరచేందుకు ప్రత్యేక గదులు సిద్ధం చేసినట్లు వివరించారు.పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతర పర్యవేక్షణకు వాహనాలను సిద్ధం చేశామని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఓటర్లు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, మున్సిపల్ కమిషనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి 

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!