ములుగు మున్సిపాలిటీ అయ్యేనా..?
– కొత్తగా 12 మున్సిపాలిటీలో కానరాని ములుగు ..!
– ఆందోళన వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు
ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాపై పాలకులు మారినా వివక్ష కొనసాగుతోందని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. జిల్లాల పునర్విభజన సందర్భంగా 2016లో ములుగును పట్టించుకోని అప్పటి ప్రభుత్వం 2019, ఫిబ్రవరి 17న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే గిఫ్ట్ గా ఏర్పాటు చేశారు. అదే విధంగా మల్లంపల్లి మండలాన్ని సైతం ఆ సందర్భంగా ఏర్పాటు చేయలేదు. ములుగు జిల్లాగా అయినప్పటికీ మున్సిపాలిటీ కాక పోవడంతో స్థానికుల నుంచి వచ్చిన అభ్యర్థనలతో మున్సి పాలిటీగా ఏర్పాటు చేస్తామని గత పాలకులు గెజిట్ నోటిఫికేషన్ వెలువరించారు. అదికూడా అర్థరహితంగా ఉందంటూ ప్రస్తుత ప్రభుత్వం కొత్త గ్రామాలను విలీనం చేస్తూ గ్రామసభలు పెట్టి ఫైల్ మూవ్ చేసింది. అయితే అది కూడా సందిగ్దంగానే కొనసాగు తోంది. శుక్రవారం తెలంగాణ సర్కారు రెండు కొత్త కార్పోరేషన్లు, 12కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ పాలనాపరమైన కసరత్తు చేస్తోందని ప్రచారం జరగుతుండగా ములుగు అందులో లేకపోవడంతో స్థానికులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. ములుగు మున్సిపాలిటీ అవుతుందా..? లేదా..?మేజర్ గ్రామపంచాయతీ గానే కొనసాగుతుందా.? పట్టణ ప్రణాళిక అధికారి కూడా లేక పోవడం, రానున్న స్థానిక ఎన్నికలు మున్సిపాలిటీ లోనా లేక గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతాయా అనే ప్రశ్నలు తలెత్తు తున్నాయి.అయితే మరికొంతమంది మేథావులు మాత్రం ములు గును నగర పంచాయతీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదనే ప్రస్తావన తీసుకువస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇన్ని రోజులు ములుగును మున్సిపాటీగా చేస్తామని చెప్పడం, ప్రస్తుతం అందుకు వ్యతిరేకంగా వార్తలు వస్తుండటంతో ములు గు పట్టణ ప్రజలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.