గిరిజన రైతులకి త్రి ఫేస్ కరెంట్ ఇవ్వాలి
– పలు సమస్యలపై భద్రాచలం ఎమ్మెల్యే కు వినతి పత్రం.
– వెంకటాపురం జూనియర్ కళాశాల లో అధ్యాపకులను నియమించాలి.
– వాలంటీర్ గా పని చేస్తున్న అధ్యాపకులను అతిధి అధ్యాపకులుగా ఉద్యోగ అవకాశం కల్పించాలి.
– ఆదివాసీలు సాగులో ఉన్న భూములకు అసైన్మెంట్ ప్రపోజల్స్ పెట్టాలి.
– పోడు భూములకు బ్యాంక్ రుణాలు మంజూరు చేయాలి..
– ఏఎన్ఎస్ రాష్ర్ట అధ్యక్షులు కొర్సా నరసీంహ మూర్తి.
వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : పాలెం వాగు ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు పిల్ల కాలువలు లేక రైతులు ఇబ్బం ది పడుతున్నారు. దీని దృష్ట్యా కాలువకు సమాంతరంగా త్రి ఫేస్ కరెంట్ లైన్ ఇచ్చినట్లయితే రైతులకు న్యాయం జరుగు తుంది. ఇందుకు గాను భద్రాచలం నియోజక వర్గ గిరిజన శాసన సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు కి ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి, వెంకటాపురం లో శనివా రం వినతి పత్రం అందజేశారు. ఎంఎల్ఏ వెంకటాపురం పర్య టన సంధర్భంగా పలు సమస్యలపై వినతి పత్రాన్ని అంద జేశారు. పాలెం ప్రాజెక్టు నుండి పంట కాలువలు ప్రవహిస్తున్న రైతులకి పిల్ల కాలువలు లేక పోవడం తో ప్రయోజనం లేకుం డా పోయిందని తెలిపారు. కనుక త్రి పేస్ కరెంట్ ఇస్తే రైతుల కు ప్రయోజన కరంగా ఉంటుందని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ లకు వివరించారు. వెంకటాపురం మండలం లో సుమారు 650 ఎకరాల ప్రభుత్వ భూములు ఆదివాసీలు సాగు చేసుకుంటున్నట్లు వివరించా రు. ఆదివాసీలు సాగులో ఉన్న భూములకు అసైన్మెంట్ ప్రపో జల్స్ పెట్టి పట్టాలు మంజూరు చేయాలని కోరినట్లు తెలియ జేశారు. జెల్లా కాలని అంగన్వాడీ నూతన భవనం నిర్మాణం పనులు నిలిచి పోయినట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రీ కాస్ట్ టెండర్ ప్రక్రియ పేరుతో అధికారులు పనులు వాయిదా వేస్తున్నారని అన్నారు. వెంకటాపురం లోని నూతన ప్రబుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందన్నారు. అధ్యాపకులు లేక పాఠా లు బోధించే దిక్కు లేదన్నారు. పేద విద్యార్థుల జీవితాలు నాశనం అయ్యాయని అన్నారు. 2024 లో సంవత్సరం లో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను పొంద లేకపోవడం సహీతుకమైన చర్య కాదన్నారు. స్వచ్చందంగా ఇదే కళాశా లలో నలుగురు స్థానికులు పాఠ్య బోధన చేస్తున్నార ని వారికి అతిధి అధ్యాపకులుగా నియమించి వారికి న్యాయం చేయ మని కోరినట్లు వినతిపత్రం లో పేర్కొన్నట్లు తెలిపారు. బర్ల గూడెం గిరిజన గ్రామపంచాయతి కి ఎస్టీ కమ్యూనిటీ హల్ మంజూరు చేయాలన్నారు.గిరిజన ఉప ప్రణాళిక నిధుల నుండి గ్రామాల్లో అంతర్గత రోడ్స్ మంజూరు చేయమని ఎమ్మెల్యే వెంకట్రావ్ ని, కలెక్టర్ దివాకర టి ఎస్ ని కోరినామని అన్నారు.సాగులో ఉన్న పోడు భూములకు వెంకటాపురం బ్యాంక్ అధికారులు పంట రుణాలు ఇవ్వడం లేదని, కలెక్టర్ సంతకం ఉంటేనే ఇస్తామని అంటున్నారని కలెక్టర్ దివాకర టి ఎస్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ దివాకర టి ఎస్ బ్యాంక్ అధికారులతో క్వార్టర్లీ సమావేశం ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. త్వరలోనే వెంకటాపురం బ్యాంక్ అధికారులని రుణాలు ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చిన ట్లు ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కే నరసింహ మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్, రవి, నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.