అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు
– త్రుటి లో తప్పిన ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం…
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పట్టణ కేంద్రం వేప చెట్టు సెంటర్లో సోమవారం సాయంత్రం భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇంజన్లో ఏర్పడిన సాంకేతిక లోపంతో అదుపు తప్పి బస్సు రోడ్డు దిగిపోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బ్రేక్ వేసి ఇంజన్ ఆపడంతో పక్కనే ఉన్న నివాస గృహాల వైపు వెళ్లకుండా బస్సు ఆగిపోయింది. దీంతో వెంకటాపురం నుండి భద్రాచలం వైపు వెళ్లే ప్రయాణికులు సుమారు 60 మంది వరకు బస్సులో ఉన్నట్లు తెలిసింది. అయితే ఆ ప్రయాణికులను వేరే, అదే భద్రాచలం డిపో కు చెందిన బస్సులో పంపించి వేశారు. ఈ మేరకు బస్సు డ్రైవర్, కండక్టర్లు భద్రాచలం డిపో మేనేజర్, మెకానికల్ విభాగానికి సమాచారం ఇచ్చారు. తృటిలో ఆర్టీసీ బస్సు ప్రమాదం తప్పి పోవడంతో ప్రయాణికులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.