విస్తృతంగా వాహన తనిఖీలు
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో శనివారం స్థానిక ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో సివిల్, సిఆర్పి ఆఫ్ పోలీసుల ఆధ్వర్యంలో సరిహద్దు ప్రాంతా లు, ప్రధాన కూడళ్లు, అటవి గ్రామాలలో విస్తృతంగా వాహన తనిఖీ లు చేపట్టారు. జిల్లా ఎస్పీ శబరిష్ ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు సిఐ అనుముల శ్రీనివాస్ సూచనల మేరకు మావోయిస్టు వారోత్సవాలను పురస్కరిం చుకొని ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలను ముమ్మరం చేశారు.ఈ కార్యక్రమంలో సివిల్ సిఆర్పిఎఫ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు