వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ
ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా నిరుద్యోగ కళాకారుల సంఘం అధ్యక్షులు మోతె రమేష్ ఆధ్వర్యంలో ములుగు పట్టణ కేంద్రంలో ఖమ్మం వరద బాధితుల సహాయార్థం విరా ళాల సేకరణను చేపట్టి మానవత్వం చాటుకున్నారు. మానవ తా హృదయంతో స్పందించి కళాకారులు చేపట్టిన కార్యక్రమా న్ని డాక్టర్ పోరిక రవీందర్ ప్రారంభించగా హుండీలతో ములు గు పట్టణంలోని వ్యాపారుల వద్ద వరద భాధితుల కోసం విరా ళాలు సేకరించారు. సేకరించిన విరాళాలను ఖమ్మం వరద బాధితులకు అందజేయనన్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్ర మంలో మోతె రమేష్, సారథి కళాకారుల అధ్యక్షులు రాగుల శంకర్, పోలెపాక యాకయ్య, బొచ్చు సాంబన్న, బత్తుల ఉపేందర్, ఇనుముల మల్లయ్య, దూడపాక రాజేందర్, కంచం బద్రి, పతిపల్లి రాజేందర్, మోతె రవీందర్, నేదురి స్రవంతి, వంక సరిత, కళా వెలుగు అరవింద్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.