చిన్నారి విద్యార్థులతో వినాయక స్వామి ఉత్సవాలు

Written by telangana jyothi

Published on:

చిన్నారి విద్యార్థులతో వినాయక స్వామి ఉత్సవాలు

– మట్టి వినాయక విగ్రహంతో పూజలు. 

– మూడవ రోజు గోదావరిలో విద్యార్థులతో నిమజ్జనం. 

వెంకటాపురం నూగూరు,  తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం నాగారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో మట్టి వినాయ కుడు విగ్రహాన్ని విద్యార్థులతో తయారు చేసి పాఠశాలలో స్వామి వారిని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు చిన్నారి విద్యార్థులతో పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యను విద్యార్థులు అత్యంత భక్తిశ్రద్ధలతో మంగళ వారం గోదావరిలో నిమజ్జనం చేశారు. విద్యార్థులను గోదా వరి ఒడ్డుకు దూరంగా ఉంచి భద్రతాపరమైన చర్యలతో స్వామివారి మట్టి విగ్రహాన్ని ఆ పాఠశాల ఉపాధ్యాయులు, గోదావరి నదిలో నిమజ్జన కార్యక్రమం కొనసాగింది.  ఈ కార్య క్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉపాధ్యా యులు, మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now