సీఎం, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం
కాటారం, తెలంగాణ జ్యోతి : తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులకు 30 శాతం పి ఆర్ సి పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ చిత్రపటాలకు కళాకారులు క్షీరాభిషేకం నిర్వహించారు. గురువారం కాటారం మండల కేంద్రంలో సారధి కళాకారులు మాట్లాడుతూ కళాకారులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పి ఆర్ సి తో కలుపుకొని జీతాలు రావడంతో కళాకారుల జీవితాల్లో వెలుగు నిండిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. పిఆర్సి పెంచేందుకు సహకరించిన మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓనపాకల కుమార్, ఆత్మకూరి మహేందర్, చీకట్ల శంకర్, సోదరి సురేందర్, సిగ్గం శిరీష, జాడి సుమలత, చిలుముల మధుబాబు, కమ్మల ప్రవీణ్ కుమార్, పులి రాధిక, గడ్డం నాగమణి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.