పేరూరులో విద్యుత్ శాఖ రైతు పొలం బాట కార్యక్రమం
– కెపాసిటర్లను విధిగా అమర్చుకోవాలి.
– వెంకటాపురం ఏడిఈ ఆకిటి స్వామి.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామంలో బుధవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటాపురం ఏడిఈ ఆకిటి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యవసాయ విద్యుత్ మోటర్లు, విద్యుత్ సరఫరా, కెపాసిటర్ల వాడకం తదితర ప్రయోజనాలు,జాగ్రత్తలు గురించి రైతు సోదరులకు వివరించారు. ప్రతి రైతు తమ విద్యుత్ మోటార్ కు కెపాసిట ర్ ను అమర్చుకోవాలని, తద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. విద్యుత్ లైన్లతోపాటు, విద్యుత్ మోటారు మరమ్మతులకు రాదని , ఇబ్బందులకు తొలగి పోతాయని తెలిపారు. కెపాసిటర్ యొక్క ప్రయోజనాలను కూలంకషంగా రైతు సోదరులకు వివరించారు. అలాగే విద్యుత్ శాఖ రైతు పొలంబాట యొక్క ఆవశ్యకతను వివరిస్తూ,విద్యుత్తు వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యుత్ శాఖ సూచనలు, సలహాలను పాటించాలని రైతు సోదరులకు కూలంకషంగా వివరించారు. ఈ కార్యక్రమాల్లో వాజేడు సెక్షన్ అధికారులు, రైతు సోదరులు, వాజేడు విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.