ఉచిత కంటి వైద్య శిబిరం లో 2041 మందికి పరీక్షలు
కాటారం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో సోమ, మంగళవారాలలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం కు భారీ స్పందన లభించింది. మాజీ స్పీకర్ శ్రీపాదరావు 26వ వర్ధంతి పురస్కరించుకుని దుదిల్ల శ్రీపాదరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన పుష్పగిరి హాస్పిటల్ సహకారం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సహాయంతో కాటారం సబ్ డివిజన్ పరిధిలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి రెండు రోజులు పెద్ద ఎత్తున కంటి సమస్యలతో బాధపడుతున్న బాధితులకు భారీ ఊరట లభించింది. రెండు రోజులు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 2041 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కాటరాక్ట్ శస్త్ర చికిత్సలు 953 మందికి, 556 మందికి కంటి చూపు సక్రమంగా కనిపించేందుకు అద్దాలు ఇచ్చేందుకు గుర్తిం చారు. 532 మంది సాధారణ సమస్యలపై పరీక్షలు నిర్వహిం చారు. 13 వ తేదీన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శ్రీపాదరావు ట్రస్ట్ ద్వారా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దెళ్ళ శ్రీధర్ బాబు 556 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు.