వాజేడు ఆరోగ్య కేంద్రంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్

వాజేడు ఆరోగ్య కేంద్రంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్

వాజేడు ఆరోగ్య కేంద్రంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్

వెంకటాపురం నూగూరు,తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మంగళవారం ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గర్భవతులను మూడు నెలల ముందుగానే గుర్తించి నమోదు చేసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ కొమరం మహేంద్ర కోరారు. అలాగే పెనుగోలు ఆశా కార్యకర్త ఉయిక సమ్మక్క అనారోగ్యంతో మృతి చెందగా సమావేశంలో వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి వారి ఆత్మ శాంతించాలని సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా పెనుగోలు ఆశా వర్కర్ కుటుంభానికి సహాయ సహకారాలు అందించాలని కోరా రు. ఈ సమావేశంలో వైద్యాధికారి డాక్టర్ కొమరం మహేంద్ర, వైద్యాధికారి డాక్టర్ గ్యానస, డి. పి.ఎం. ఓ. సత్యనారాయణ, హెచ్ఇఓ కొప్పిలి కోటిరెడ్డి, హెల్త్ సూపర్వైజర్స్, వెంకట రమణ, ఏఎన్ఎం. నాగేంద్ర కుమారి, సత్య, నాగవేణి, ఛాయాదేవి, లలిత కుమారి, కన్యాకుమారి, రాజేశ్వరి, హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేశ్వర్లు, శేఖర్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. వైద్యాధికారి మాట్లాడుతూ ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండాలని నీరు, మజ్జిక, కొబ్బరిబోండం ఎక్కువ తాగాలని, వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని, వైద్యాధికారి సూచించడం జరిగింది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment