1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
– గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి డిమాండ్.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో, ప్రభుత్వ భూముల క్రయ, విక్రయాలు ఆపాలని, ఏజెన్సీ భూముల పై 1/70 ఎల్టిఆర్ చట్టాలను అధికారులు కచ్చితంగా అమలు చేయాలని జిఎస్పీ నేత పూనెం సాయి డిమాండ్ చేశారు. అధికారులు ఉదాసీనతగా వ్యవహరించడంతో గిరిజనేతరు లు ప్రభుత్వ భూముల్లో తిష్ఠ వేసి యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగిస్తున్నారని పూనెం సాయి ఆరోపిం చారు. శుక్రవారం నాడు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని, గిరిజనేతరులు ప్రభుత్వ భూముల క్రయ,విక్రయాలు ఆపాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ సంఘ ఆధ్వర్యంలో వెంకటాపురం మండల తాసి ల్దార్ లక్ష్మీ రాజయ్యకి వినతిపత్రం అందజేశారు. అనంతరం జి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి పూనేం సాయి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు వెన్నుముక లాంటి 1/70 ఎల్టీఆర్ చట్టాలు అమలులో ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా వెంకటాపురం మండలం లో గిరిజన చట్టానికి యథేచ్ఛగా తూట్లు పోడుస్తున్నారు. ఐటీడీఏ కూడా ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని, వెంకటాపురం శివాలయం మొదలుకొని పెట్రోల్ బంక్ వరకు అడ్డగోలుగా జరుగుతున్న అక్రమాలు అధికారుల కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నిం చారు. ఇప్పటికైనా అధికారులు వీటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో అక్రమంగా గిరిజనేతరులు నిర్మించిన భవనాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకో వాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతాం అని హెచ్చరించారు.ప్రభుత్వ భూములను గిరిజెనేతరులు ఆక్రమిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని, వెంకటాపురం(జెడ్) సర్వే నంబర్ 68 లో ప్రభుత్వ భూములు మొత్తం కబ్జాకు గురైందని ఆయన ఆరోపించారు. కబ్జా కి గురైన వెంకటాపురం(జెడ్) సర్వేనెంబర్ 68 గల ప్రభుత్వ భూమిని వెంటనే అధికారులు స్వాధీనం చేసుకొని, ఇండ్లు లేని పేద ఆదివాసి కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో గొండ్వాన సంక్షేమ పరిషత్ లో ఆధ్వ ర్యంలో భారి ఎత్తున ఆంథోళనలు చేస్తామని, ఇండ్లు లేని పేద కుటుంబాలకు ఇస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిఎస్పి సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.