బీసీ మర్రిగూడెం పంచాయతీ ట్రాలీ మాయం

Written by telangana jyothi

Published on:

బీసీ మర్రిగూడెం పంచాయతీ ట్రాలీ మాయం

– పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్యదర్శి

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం పట్టణ శివారు బీ.సీ మరి గూడెం గ్రామ పంచాయతీ ట్రాలీ చోరీకి గురైంది. ఈ పంచాయతీ కార్యదర్శి నెలరోజుల క్రితం బదిలీ కాగా మరొక కార్యదర్శిని నియమిం చారు. కొత్తగా వచ్చిన కార్యదర్శి కూడ బదిలీ చేయించుకుని వెళ్ళిపోయారు. దీంతో వెంకటాపురం పట్టణ శివారులోని బీ.సీ మరి గూడెం గ్రామపంచాయతీకి, వెంకటాపురం మేజర్ పంచాయతీ కార్యదర్శి కి అదనపు భాథ్యతలు అప్పగిం చారు. అయితే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బిసి మరి గూడెం పంచాయతీ పరిధిలోని నూగూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాం ఆవరణలో మొక్కలు నాటేందుకు, గ్రామపంచాయతీ, ఈజీఎస్ అధికారులు, బీ.సీ మరి గూడెం ట్రాక్టర్ ట్రాలీని, ప్రైవేట్ ట్రాక్టర్ కు తగిలించుకొని ఏఎంసీ మార్కెట్ ఆవరణలో కి నర్సరీ నుండి తెచ్చి మొక్కలు నాటారు. కాళీ ట్రాలీని ఏఎంసీ మార్కెట్ ఆవరణలోనే వదిలివేశారు. 10 రోజుల క్రితం ఏఎంసీ గోదాం ఆవరణలో మొక్కలు నాటి అక్కడే ట్రాలీ అక్కడే వదిలి వేయగా మాయమైంది. విషయం తెలుసుకున్న వెంకటాపురం ఇన్చార్జి కార్యదర్శీ ట్రాలీ  మాయం విషయంపై వెంకటాపురం పోలీసు లకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీస్ శాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.  ఈ విషయంపై పోలీస్ శాఖ కనకదుర్గమ్మ గుడి, వెంకటాపురం మెయిన్ మార్కెట్, గెస్ట్ హౌస్ సెంటర్ ఇతర రహదారుల వద్ధ అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మాయమైన ట్రాక్టర్ ట్రాలీ సుమారు లక్ష 50 వేల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ విషయంపై వెంకటా పురం మేజర్ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ ను మీడియా ప్రతినిధులు వివరణ కోరగా ట్రాలి మాయమైన విషయంపై వెంకటాపురం పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై ములుగు పంచాయతీ అధికారికి నివేదిక సమర్పించినట్లు తెలిపారు.

Leave a comment