వెంకటాపురంలో శ్రీ కార్తిక జ్యోతిర్మహోత్సవం

Written by telangana jyothi

Published on:

వెంకటాపురంలో శ్రీ కార్తిక జ్యోతిర్మహోత్సవం

– 10 వేల 302 దీపాలు వెలిగించే భక్తిరస కార్యక్రమం. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో మంగపేట రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా శ్రీ కార్తిక జ్యోతిర్మహో త్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పదివేల 302 కార్తీక దీపాలు వెలిగించే కార్య క్రమం అంగ రంగ వైభవంగా నిర్వహించేందుకు స్వామివారి మంది రం ముందున్న అన్ని ఏర్పాట్లు గావించింది. సోమవారం సాయం త్రం 6 గంటల నుండి శ్రీ కార్తీక జ్యోతిర్మహోత్సవం దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆలయ కమిటీ విస్తృతంగా ప్రచార కార్యక్రమంతో పాటు, స్వామి వారి కరపత్రాలు తో గ్రామ గ్రామాన ఆటో ద్వారా లౌడ్ స్పీకర్తో భక్తులకు విజ్ఞప్తి చేసింది. స్వామివారి శ్రీ కార్తిక జ్యోతిర్మహోత్సవాన్ని జయప్రదం చేయాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. కార్తీకదీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం, అత్యంత పవిత్ర మైనదని, కార్తీక మాసంలో నిత్య దీపారాధన చేసే స్త్రీలు సుమంగ ళులు అవుతారని, సంతానవంతులు అవుతారని, వారి ఐదవ తనం దృఢమవుతుందని, ఆమె కుటుంబం యావత్తు అష్ట ఐశ్వ ర్యాలు ఆయురారోగ్యాలతో సద్బుద్ధి జ్ఞానంతో ఉంటారని, భక్తుల నమ్మకం. ఇంతటి విశేషమైన కార్తీక దీపారాధన చేసుకునే మహ త్తర అవకాశాన్ని వెంకటాపురం మంగపేట రోడ్ లో ఉన్న శ్రీ అభ యాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ విస్తృత ఏర్పాటు చేసింది. ఆలయ కమిటీ భక్తుల సౌకర్యార్థం రంగు రంగుల విథ్యుత్ దీపాలతో స్వామివారి ఆలయాన్ని, ప్రాంగణాన్ని అలంకరించి మంచినీటివసతి సౌకర్యాలు కల్పించారు. ప్రతి భక్తుడికి స్వామి వారి ఇష్ట పూర్వక ప్రసాదం అందే విధంగా ఆలయ కమిటీ ఏర్పాటు కావించింది. శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయ అభివృ ద్ధికి సహకరించిన ఏడాది భక్తుల విరాళాల వివరాలను కరపత్రా లలో ముద్రించి భక్తులకు పంపిణీ చేశారు. స్వామివారి వెండికళ్ళు నేత్రాలను సమర్పించిన పందిళ్ళ శ్రీ దేవి రవి దాతల పేర్లతో సహా టెంట్ సప్లై చేసిన దాతలు కొయ్యల ప్రవీణ్, కూసం నాగరాజు, మరియు లైటింగ్ డెకరేషన్ దాత రాచకొండ రాము తదితరులు వివరాలను గత ఏడాది స్వామి వారి దీపోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సహాయం చేసారని ఆహ్వన కరపత్రాలు లో ముద్రించారు. శ్రీ కార్తీక జ్యోతిర్మహోత్సవం జయప్రదం చేయాలని ఆలయ కమిటీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now