విస్తృతంగా వాహనాల తనిఖీలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు, వెంకటాపురం, పేరూరు పోలీస్ స్టేషన్ ల పరిధిలో ప్రధాన రహదారులపై విస్తృతంగా వాహనాల తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన వెంకటా పురం సర్కిల్లో పి ఎల్ జి ఏ వారోత్సవాల సందర్భంగా అసాంఘిక శక్తులు తమ ఉనికిని కాపాడుకునేందుకు దుశ్చర్యలకు పాల్ఫడె అవకాశం ఉందని, గూడచారి,ఇంటలిజెన్స్ సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు అదనపు పోలీసు బలగాలతో అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో సైతం కార్ట్ న్ అండ్ చర్చ్ కార్యక్రమాలతో, పోలీస్ శాఖ భద్రతాపరమైన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో భాగంగా ప్రధాన రహదారులపై ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో సివిల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు ఆధ్వర్యంలో సివిల్ పోలీస్, సిఆర్పిఎఫ్ సిబ్బంది వాహనాల తణీకీల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పి ఎల్ జి ఏ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు తమ ఉనికిని కాపాడు. కునేందుకు ,ఏదో ఒక ప్రాంతంలో దుశ్చర్యలు కు పాల్పడే అవకాశం ఉందని, మావోయిస్టు కవ్వింపు చర్యలను తిప్పుకొట్టేందుకు పోలీస్ శాఖ అదనపు భద్రతా బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ లతో, బలగాలు ను మోహరింప చేసి నట్లు సమాచారం.