బ్రాహ్మణపల్లిలో కార్డన్ సర్చ్
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లిలోని ఎస్సీ కాలనీ లో శనివారం ఉదయం మహదేవ పూర్ పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. అందులో భాగం గా ఇంటింటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనుమానస్పదంగా ఏమైనా కనిపిస్తే వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకుని వాహన పత్రాలను పరిశీలించారు. నెంబర్ ప్లేటు లేని వాహనా లను గుర్తించి వాటికి జరిమానా విధించారు. అనంతరం గ్రామం లో సెంటర్ వద్ద గ్రామస్తులతో సమావేశం అయ్యారు.ఈ సంద ర్భంగా మహదేవపూర్ ఎస్సై కె..పవన్ కుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ సహకరిoచాలని, అలాగే రాబోవు నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపు కోవాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని, మైనర్లకు బండి ఇవ్వవద్దని, గ్రామంలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నిషేధిత పదార్థాలైన గుడుంబాను ప్రోత్సహించవద్దని, ఒకవేళ ఎవరైనా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిం చారు. యువత బాగా చదువుకొని, ఉన్నత శిఖరాలను అధిరో హించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ పోలీసులు, హెచ్ సి- పున్నం, కానిస్టేబుల్స్ కిషన్, చంద్రమోహన్, తిరుపతి తెలంగాణ స్పెషల్ పోలీసులు, హోంగార్డులు,గ్రామస్తులు, యువ కులు పాల్గొన్నారు.