ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి తరలిన వెంకటాపురం కాంగ్రెస్ నేతలు.

Written by telangana jyothi

Published on:

ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి తరలిన వెంకటాపురం కాంగ్రెస్ నేతలు.

– డిప్యూటీ సీఎంగా నియమితులు అఇన మల్లు బట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు.

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : హైదరాబాదు లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి,ములుగు జిల్లా వెంకటాపురం కాంగ్రెస్ నేతలు గురువారం వేకువ జామునే హైదరాబాద్ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా డిప్యూటీ ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మల్లు భట్టి విక్రమార్క ను కలిసి పుష్పగుచ్చం అందజేసిన వెంకటాపురం కాంగ్రెస్ నేతలు శుభాకాంక్ష లు తెలియపరిచారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తు న్న ఎనుముల, రేవంత్ రెడ్డికి కూడ శుభాకాంక్షలlను నేతల ధ్వరా అందజేశారు. రాజధాని వెళ్ళిన వెంకటాపురం మండల కాంగ్రెస్ నాయకులు , ఈ సందర్భంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోయే మల్లు భట్టి విక్రమార్కని కలిసి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను అమలు అయ్యే విధంగా, అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందే విధంగా, తామంతా కలిసికట్టుగా, కాంగ్రెస్ కార్యకర్తలుగా కృషి చేస్తామని తెలిపారు. 10 ఏళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక కష్ట  నష్టాలు ఎదుర్కొన్న, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రస్ పార్టీ అభివృద్ధి ,తో పాటు కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ పధం వైపు నడిపించామని తెలిపారు. ఇకపై కూడా అదే బాటలో నడుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాలకు, కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు అనుగుణంగా తామంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోయే మల్లు భట్టి విక్రమార్కకు తెలియపరచి, వారి నుండి ఆశీర్వాదాలు పొందారు. శుభాకాంక్షలు తెలిపిన మండల కాంగ్రెస్ నేత , వెంకటాపురం సొసైటీ చైర్మన్ చిడెం, మోహనరావు, మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు, మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సయ్యద్ హుస్సేన్ , ఎం పీ టీ సీ గార్ల పాటి. రవి, నేతలు కాంగ్రెస్ నాయకులు శ్రీరాముల. రమేష్, కార్యక ర్తలు, రావెల నాని, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now